ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. అక్కడి తెలుగువారు చంద్రబాబుకు పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు. సాయంత్రం జరిగే కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే పలువురు జాతీయ నాయకులతో చంద్రబాబు భేటీకానున్నారు.