ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో బెంగళూరు బయల్దేరనున్నారు. విధాన సౌధలో జరిగే కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు.