ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవంతంగా బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 21, 2018, 02:19 PM

న్యూఢిల్లి : భారత శాస్త్రవేత్తలు నేడు బ్రహ్మోస్‌ క్షిపణిని ఒడిశా తీరంలోని క్షిపణి ప్రయోగ కేంద్రంనుంచి డిఆర్‌డిఒ శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. రష్యా – భారత్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ వచ్చే దశాబ్ద కాలంలో హైపర్‌సోనిక్‌ క్షిపణిగా అవతరించనున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. లైఫ్ ఎక్స్‌టెన్షన్ ప్రోగ్రామ్ కింద దీన్ని ప్రయోగించారు. మొదటిసారి ఇండియన్ డిఫెన్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో బ్రహ్మోస్ జీవితకాలాన్ని పొడిగించారు. మిస్సైల్ లైఫ్‌ను 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల కాలానికి పెంచేశారు. దీని వల్ల భారీ స్థాయిలో క్షిపణి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఒడిశా తీరంలో ఈ పరీక్ష జరిగింది. బ్రహ్మోస్ లైఫ్‌ను పొడిగించడం వల్ల ఇండియన్ ఆర్మీకి కలిసిరానున్నది. బ్రోహ్మోస్ జీవిత కాలాన్ని పొడిగిస్తూ రూపొందించిన టెక్నాలజీను భారత్ మొదటిసారి డెవలప్ చేసింది. ఈ పరీక్ష సక్సెస్ కావడం వల్ల మంత్రి నిర్మలా సీతారామన్.. డిఫెన్స్ టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పారు. ఈ టెక్నాలజీతో మిస్సైళ్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుందన్నారామె. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com