సూపర్ స్టార్ రజనీకాంత్ అతి త్వరలోనే తన రాజకీయ పార్టీకి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నాడు. కొన్నాళ్ళుగా సస్పెన్స్ పెడుతూ వస్తున్న తలైవా తన పార్టీ గ్రౌండ్ వర్క్ మాత్రం ముమ్మరంగానే జరుపుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా తన ఇంట్లో మహిళలతో కలిసి కీలక చర్చలు జరిపాడు రజనీ అండ్ టీం. ఆ మధ్య అభిమానులతో పాటు పలువురు ప్రముఖలతోను రజనీ పలు మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. అయితే రజనీకాంత్ తన పార్టీకి ‘రజినీ మక్కల్ మంద్రమ్’ అనే పేరు పెడతాడని జోరుగా ప్రచారం జరుగుతున్నా దీనిపై క్లారిటీ రావడం లేదు. 234 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపనున్నట్టు రజనీకాంత్ గత ఏడాదే ప్రకటించాడు. ఈ సారి ఎలక్షన్స్‌లో ఇటు రజనీకాంత్, అటు కమల్ హాసన్‌లు బరిలోకి దిగనుండడంతో తమిళ రాజకీయాలు ఈ సారి వాడి వేడిగా ఉండనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక రజనీ సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన కాలా చిత్రం జూన్ 7న విడుదల కానుంది. పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.