లక్నో : అలహాబాద్ ఎస్పీని బీజేపీ ఎమ్మెల్యే బెదిరించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ సమావేశానికి అలహాబాద్ నార్త్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ భాజ్పేయి వచ్చాడు. అయితే సమావేశం జరుగుతున్న వేదిక వద్దకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేను ఎస్పీ ఆపారు. దీంతో హర్షవర్ధన్ ఎస్పీపై కోపం చేశారు. మీకు కావాల్సింది హింసనే. ఎల్లప్పుడూ లాఠీలకు పని చెప్పాలని.. హింసను ప్రేరేపించే విధంగా ఉంటారని ఎస్పీని ఎమ్మెల్యే బెదిరించారు. ఎమ్మెల్యేలను గుర్తించడంలో పోలీసు ఉన్నతాధికారులు విఫలమవుతున్నారని హర్షవర్ధన్ రుసరుసలాడారు.