ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 రోజులలో బల నిరూపణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 17, 2018, 09:28 AM

బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రిగా యెడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. బల నిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు యెడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో బల నిరూపణ అనంతరమే మంత్రివర్గాన్ని ఏర్పాుట చేయనున్నట్లు యెడ్యూరప్ప చెప్పారు. కర్నాటక ముఖ్యమంత్రిగా యోడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడం ఇది మూడో సారి. 2007, 2008 లలో కర్నాటక ముఖ్యమంత్రిగా యోడ్యూరప్ప రెండు సార్లు  పని చేశారు. కర్నాటక సీఎంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన యెడ్యూరప్ప కర్నాటక అసెంబ్లీకి ఇప్పటి వరకూ 7 సార్లు ఎన్నికయ్యారు. శిరికాపుర నియోజకవర్గం నుంచి యెడ్యూరప్ప 1983లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో విపక్ష నేతగా ఉన్నారు. కర్ణాటక గవర్నర్‌ వజూభాయ్‌ వాలా నేడు కాషాయం రంగు కోటు ధరించి, తాను ఎప్పటికే బిజెపి మనిషినేనని పరోక్షంగా చెప్పుకున్నారు. బిజెపి నేత యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడానికి వచ్చిన గవర్నర్‌ కాషాయం రంగు కోటు ధరించడం బిజెపి పట్ల ఆయనకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని పలువురు వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com