ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి వార్తలపై స్పందించిన చాహల్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 23, 2018, 04:33 PM

దక్షిణాది నటి తనిష్క కపూర్‌ను టీమిండియా యువ స్పిన్నర్‌ చాహల్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై చాహల్‌ ట్విటర్‌ ద్వారా స్పందించాడు. తనిష్క కపూర్‌ తనకు స్నేహితురాలు మాత్రమేనని.. ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నాడు.


‘ప్రతి ఒక్కరికీ హలో, నా పెళ్లి వార్తలకు సంబంధించి వస్తున్న వార్తలపై ఈ మెసేజ్‌ పెడుతున్నాను. తనిష్కతో నా పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ఆమె నా స్నేహితురాలు మాత్రమే. ఈ సందర్భంగా నేను మీడియా, అభిమానులను ఒకటే కోరుతున్నారు. ఈ వార్తలకు ఇంతటితో చెక్‌ పెట్టేయండి. ఇంకా దీన్ని వైరల్‌ చేయొద్దు.  మీరంతా నన్ను గౌరవిస్తారని అనుకుంటున్నా. నా పెళ్లిపై వస్తున్న వార్తలను ఇక పోస్టు చేయడం ఆపండి. ఇలాంటి వార్తలు పోస్టు చేసే ముందు ఒకసారి నిర్ధరించుకోవడం ఎంతైనా అవసరం. థాంక్యూ. లవ్‌ యూ ఆల్‌’ అని చాహల్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.


తనిష్క కపూర్‌తో చాహల్‌ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు, త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. ముంబయిలో జన్మించిన తనిష్క కపూర్‌ ప్రస్తుతం కన్నడ సినిమాల్లో నటిస్తోంది. 2015లో ‘ఫస్ట్‌ ర్యాంకు రాజు’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఐపీఎల్‌ 11వ సీజన్‌లో చాహల్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన చాహల్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com