కర్నూలులో ఎంపి టిజి వెంకటేశ్ ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్నారు. విజయవాడలో ధర్మపోరాట దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంఘీభావంగా ఇక్కడ జరుగుతున్న దీక్షలో వెంకటేశ్ పాల్గొన్నారు. ఈ దీక్షలో జడ్పి ఛైర్మన్ రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో ధర్మపోరాటదీక్షలో మంత్రి అఖిలప్రియ పాల్గొన్నారు. విజయవాడలో ధర్మపోరాట దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంఘీభావంగా ఇక్కడ జరుగుతున్న దీక్షలో అఖిలప్రియ పాల్గొన్నారు. రాజ్‌విహార్ కూడలిలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్నారు. సిఎం ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా చేపట్టిన ఈ దీక్షలో ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, కుడా ఛైర్మన్ సోమిశెట్టి పాల్గొన్నారు.