ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబును పొగిడిన ఉండవల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 01, 2018, 06:06 PM

సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ అనే పేరున్న మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌న్నిహితుడైన ఉండ‌వ‌ల్లి  తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై అవ‌కాశం దొరికితే విరుచుకుప‌డే సంగ‌తి తెలిసిందే. అయితే  తాజ‌గా బాబును ఆకాశానికి ఎత్తేశారు. 



67 ఏళ్ల చంద్ర‌బాబు నిరంతరం శ్ర‌మించే నాయ‌కుడని అన్నారు. ద‌క్షిణాదిలోనే చంద్రబాబు అంత పేరున్న మా నాయ‌కుడు జాతీయ రాజ‌కీయాల్లో లేనేలేడ‌ని కితాబిచ్చారు. హ‌ఠాత్తుగా ఉండ‌వ‌ల్లి ఈ స్థాయిలో కితాబు ఎందుకు ఇచ్చార‌నేది అర్థ కావ‌డం లేద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇటీవ‌ల కేంద్రప్ర‌భుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టిన ఉదంతాన్ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి ప్ర‌స్తావిస్తూ, అందుకు మమ‌తా బెన‌ర్జీ వంటి నేత‌లు సైతం మ‌ద్ద‌తుగా నిల‌వడాన్ని విశ్లేషిస్తూ `జాతీయ రాజ‌కీయాల్లో క్రియాశీలంగా ఉండే ముఖ్య‌నాయ‌కులు చంద్రబాబును ఓ మేధావిగా చూస్తున్నారు. మోడీకి వ్య‌తిరేకంగా కూట‌మిని తీర్చిదిద్దే స‌మ‌ర్థ‌వంత నాయ‌కుడ‌ని భావిస్తున్నారు.` అని ఉండ‌వ‌ల్లి విశ్లేషించారు. 

అంతేకాకుండా 2019 ఎన్నిక‌ల గురించి ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. `ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుగుణంగా మార్చుకోవ‌డంలో చంద్ర‌బాబు నేర్పరి. ఎన్నిక‌ల‌కు ఇంకో ఏడాది స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో బాబు త‌న వ్యూహాల‌కు ప‌దునుపెడ‌తారు. 2019లో తిరిగి చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌చ్చు. అంతేకాకుండా కీల‌క పార్టీల‌తో క‌లిపి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి 2019లో కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి ఏపీకి న్యాయం చేస్తారు` అని ఉండ‌వ‌ల్లి ఆకాంక్షించారు.

2019లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ అని ఉండ‌వ‌ల్లి విశ్లేషించారు. `ప్ర‌జ‌లు అదృష్ట‌వంతులు అయితే రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీకి 100 సీట్ల‌కు మించి రావు. ద‌క్షిణాదిలో బీజేపీ ప్ర‌భావం త‌గ్గుతోంది. ఉత్త‌రాదిలో ఆ పార్టీ పుంజుకునే అవ‌కాశం త‌క్కువే. కాంగ్రెస్ పార్టీ త‌న మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి 2019లో ఎన్నిక‌ల త‌ర్వాత అధికారంలోకి రానుంది.` అని వివ‌రించారు. 

ప్ర‌జ‌లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాల‌న‌కు మ‌ధ్య తేడా తెలుసుకున్నార‌ని ఉండ‌వ‌ల్లి విశ్లేషించారు. ` ఎవరి సొమ్ముల‌కు వారు బ్యాంకుల్లో వ‌ర‌స‌ల్లో గంట‌ల‌ పాటు నిల‌వ‌డం ఎందుకు అనేది అంద‌రికీ అర్థ‌మైంది. పెద్ద ఎత్తున అవినీతి, బ్లాక్‌మ‌నీ పెర‌గ‌డాన్ని గ‌మ‌నించారు. దేశాన్ని న‌డిపించే పార్టీ కాంగ్రెస్ అని నిర్ణ‌యించుకున్నారు` అని ఉండ‌వ‌ల్లి విశ్లేషించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com