న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తన యాప్‌ను డిలీట్ చేసింది. ఐఎన్‌సీ యాప్‌లోనూ భారీ స్థాయిలో సెక్యూర్టీ ఉల్లంఘన జరిగిందని ఫ్రాన్స్‌కు చెందిన ఇలియట్ అండర్సన్ అనే హ్యాకర్ తెలిపాడు. పార్టీ సభ్యత్వం కోసం యాప్‌కు దరఖాస్తు చేసుకుంటే, దాని నుంచి పర్సనల్ డేటా ఓ హెచ్‌టీటీపీ లింకు ద్వారా లీకవుతుందని అతను ఆరోపించాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్త పడింది. ఫ్రెంచ్ హ్యాకర్ ఆరోపణలు చేయడంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఎన్‌సీ యాప్‌ను తొలిగించింది. సభ్యత్వం కోసం ఇచ్చిన డేటా హెచ్టీటీపీలో ఎన్కోడ్ అయి ఉందని, అది హెచ్టీటీపీఎస్లో అయితే సెక్యూర్డ్ అయి ఉంటుందని, అందుకే పర్సనల్ డేటా సలువుగా చోరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్రెంచ్ హ్యాకర్ తెలిపాడు. తాను ట్వీట్ చేయడానికి ముందే కాంగ్రెస్ పార్టీ తన అఫిషియల్ యాప్‌ను డిలీట్ చేసిందని ఆ హ్యాకర్ మరో ట్వీట్ చేశాడు. ప్రధాని మోదీకి చెందిన నమోయాప్పై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తన యాప్‌ను ముందుగానే డిలీట్ చేసిందని బీజేపీ పార్టీ ఐటీ విభాగం ఆరోపించింది. అయితే తాము సభ్యత్వాన్ని యాప్ ద్వారా చేయమని, కేవలం వెబ్సైట్ మాత్రమే సభ్యత్వాన్ని నమోదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి ఒకరు తెలిపారు. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ యాప్‌లతో యూజర్ల డేటాను దుర్వనియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.