ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రసకందాయంలో కడప రాజకీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 01:04 AM

-వేడెక్కుతున్న కడప స్థానిక సంస్థల ఎన్నిక    
-గెలుపే లక్ష్యంగా ఇరుపార్టీల దృష్టి    
-ఇరుపక్షాల్లోనూ క్రాస్‌ఓటింగ్‌ గుబులు  
-ఓటర్ల విలాసాల ఖర్చు తడిసి మోపెడు  
-రసవత్తరంగా కడప స్థానిక ఎమ్మెల్సీ పోరు    
-శిబిర రాజకీయాల్లో  కోర్కెల చిట్టాలు    
-ఉపాధ్యాయులకు నగదు, బ్యాగులు    
-పట్టభద్రులకు సెల్‌ఫోన్లు, డబ్బుల ఎర 
కడప నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కడప రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. శిబిర రాజకీ యాలు, దాడులు, ప్రతిదాడులు, వ్యూహాలు, కేసుల నమోదుతో ఉత్కంఠ రేపు తోంది. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 840 మంది సభ్యులున్నారు. గెలుపు లక్ష్యం 421 ఓట్లపై రెండు పార్టీలు దృష్టి సారించాయి. పార్టీల ఫిరాయింపు నేపథ్యంలో ఇరు పక్షాలకు సంఖ్యాబలంపై లెక్క తప్పింది. ఎన్నిక నేపథ్యంలో సంఖ్యాబలాన్ని పెంచుకు నేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అధికార పక్షం బీటెక్‌ రవిని, ప్రతిపక్షం వెఎస్‌ వివేకానందరెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించాయి. వారిద్దరూ పులివెందుల ప్రాంతీయులు కావడం గమనార్హం. ఈ ఎన్నికలో విజయం తమ దంటే తమదంటూ ఇరుపక్షాలూ ప్రకటించుకుంటున్నాయి. రెండు పార్టీల అధి నేతలు ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. తమ మద్దతుదారులతో తెదేపా వర్గాలు రాజధానిలో పరేడ్‌ నిర్వహించాయి. ఇటీవల పులివెందులకు నీళ్లివ్వడాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుని టీడీపీ రంగంలోకి దిగింది.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ కూడా జిల్లా పర్యటనల్లో పలు సందర్భాల్లో ఎన్నికపై సమీక్షించి అప్రమత్తం చేశారు. ఎన్నికల ప్రకటన వెలువడినంతనే ఇరుపక్షాల్లోనూ ఉత్కంఠకు తెరలేచింది. సంఖ్యాబలాన్ని పెంచుకునే క్రమంలో ఇరుపక్షాలూ దాడులకు దిగడం, అపహరణలకు సిద్ధమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన ఇరుపక్షాలూ చివరికి శిబిర అంకానికి తెరలేపాయి. ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ శిబిరాన్ని బెంగళూరుకు చేర్చింది. అధికారపక్షం చిత్తూరు, అమరావతి తదితర ప్రాంతాలకు చేర్చుతోంది. ఈ శిబిరాల్లో ఓటర్ల విలాసాల ఖర్చు తడిసి మోపెడవుతోంది. అధికార పక్షం తమ మద్దతుదారుల సంఖ్యను 446గా ప్రకటిస్తోంది. క్రాస్‌ఓటింగ్‌ ఇరుపక్షాల్లోనూ గుబులు రేపుతోంది.
కోట్లు పలుకుతున్న ఓట్లు...
చికెన్‌ టిక్కా.. తందూరి ముక్క.. మటన్‌ బిర్యానీ, రొయ్యల వేపుడు.. ఇదేదో హోటల్‌లో మెనూ అనుకుంటే పొరబడినట్లే. ఏదో విందు భోజనానికి ఇచ్చిన ఆర్డరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు మూడుపూటలా ఇస్తున్న ఆఫర్లు ఇవి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. సాక్షాత్తూ రాష్ట్ర సరిహద్దుల్లో, ఏకంగా రాజధాని శివారుల్లోని రిసార్టుల్లో నాయకుల శిబిరాలు సాగుతున్నాయి. ఇందులో ఉన్న వారి కోర్కెల చిట్టాలు అంతƒ ంతకు పెరుగుతున్నాయి. అదే విధంగా ఖర్చు కూడా రూ.కోట్లకు చేరు తోంది. అయినా భరిస్తూ పార్టీలు నాయ కులను సంతృప్తి పరచేం దుకు యత్నిస్తున్నారు. జిల్లాలో రెండు నెలల ముందు నుంచే ఇరుపక్షాలు పోటా పోటీగా సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు ప్రయత్ని స్తున్నాయి. ఓ దశలో ఆపరేషన్‌ ఆకర్‌‌ష ద్వారా తమదైన రీతిలో కసరత్తు సాగి ంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి మరింత రసవత్తరంగా మారింది. చివరకు ఇరుపక్షాలు ప్రజాప్రతినిధులను తమ వారంటే తమ వారంటే బాహాబాహీకి దిగడం, కేసుల నమోదు, దాడులతో ఇబ్బందికరంగా మారిన క్రమంలో రెండు పార్టీలకు సంబంధించి శిబిరాల వెపు అడుగులేశారు. ఆ క్రమంలోనే రాజధానుల్లో మకాం వేశారు. శిబిరాల్లో ఏం జరుగుతోందో ఆరా తీస్తే ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. బెంగళూరు శివారులోని ఓ రిసార్టులో ఒక పార్టీకి చెందిన సభ్యులు మకాం వేశారు. పెద్ద రిసార్టుగా పేరొందిన అందులోనే అందరికీ దాదాపుగా వసతి కల్పించినట్లు సమాచారం. ఇందుకు నెల అద్దె లెక్కన అన్ని గదులను బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోండగా గదులకు రూ.లక్షల్లో అద్దె చెల్లించేందుకు సుముఖత చూపినట్లు చెబుతున్నారు. ఒకరి నుంచి ఇద్దరి వరకు ఒక్కో గది కేటాయించి అందులో వారికి సకల సదుపాయాలను ఏర్పాటు చేశారన్నది ఆరా తీస్తే తెలుస్తోంది. ఆధిపత్య పార్టీ పరంగా చూస్తే తమ శిబిరాలను మూడుచోట్ల నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి పరిసరాల్లోని ఓ ఐల్యాండ్‌లో గల రిసార్టును తమ వారికి వసతి చేకూర్చేందుకు వేదిక చేసినట్లు చెబుతున్నారు. దీంతోపాటు చిత్తూరు జిల్లా శివారులో మరో రిసార్టును సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందుకు నెలకు రూ.10 లక్షల లెక్కన అద్దె చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తంగా కడప జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక కీలకంగా మారింది. రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పీఠాన్ని చేజిక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
మెనూతో ముచ్చెమటలు
మొన్నటివరకు తమిళనాడు రాజకీయానికి కూవత్తూరు సమీపంలోని గోల్డె న్‌బే రిసార్టు వేదిక కావడం తెలిసిందే. అన్నాడీఎంకేలో రెండు వర్గాలకు సంబంధించి హోరాహోరీ నెలకొనగా అందులో ఓ వర్గం ఇదే రిసార్టు నుంచే చక్రం తిప్పారన్నది సుస్పష్టమే. ఈ క్రమంలోనే ఇప్పుడు కడప రాజకీయం కూ డా రిసార్టుల్లోకి చేరడం కీలకంగా మారింది. ఇక్కడ ఓటర్లుగా ఉన్న సభ్యుల మె నూ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎవరికి తోచిన రీతిలో వారు గొంత ెమ్మ కోర్కెలకు దిగుతున్నట్లు తరచిచూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా నిత్యం మాంసాహారం తప్పనిసరి చేస్తున్నట్లు సమాచారం. ఇందులోనూ ఎవరికిష్టమైన రీతిలో వారు ఆర్డర్లకు దిగుతున్నారు. ఓ దశలో కోస్తా తీర ప్రాంత ఉత్పత్తులైన రొయ్యల నుంచి చేపల వైపు కొందరు మనసు పెడుతుండటంతో లెక్క పెరిగిపో తోంది. మూడుపూటలా ఇదే తరహాలో తతంగం ఉండటంతో నిర్వాహకుల పాట్లు అన్నీఇన్నీకావు. మెనూలో కనీసం డబుల్‌ డిజిట్‌లో ఆహార పదార్థాలను ఉంచాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇందులోనూ మద్యం ప్రియుల సంగతి సరేసరి. ప్రత్యేక సరకుతో ప్రసన్నం చేసుకునే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఇక్కడ ఖర్చు తడిసి మోపెడవుతోందన్నది సుస్పష్టం. ఇరుపక్షాలకు సంబంధించి చివరకు రూ.కోట్లలోనే లెక్క తేలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని పార్టీలు రూ.20 లక్షల పైబడి తాయిలాలకు పచ్చ జెండా ఏపడం.. అదనపు ప్యాకేజీతోనూ ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిన క్రమంలో ఇప్పుడు రిసార్టుల భారం పెనుభారంగా మారుతోంది. మొత్తంగా ఎన్నిక పూర్తయ్యే నాటికి ఎంత ఖర్చవుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఉపాధ్యాయులకు బ్యాగులు, ఫోన్లు
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న వారిలో కొందరు ఎలాగైనా గెలవాలని ఖర్చుకు వెరవడం లేదు. నామినేషన్ల పర్వంలోనే వంద లాది వాహనాలతో ర్యాలీలు తీశారు. అనంతపురంలో నామినేషన్‌ వేసిన రోజే లక్షల్లో వ్యయం చేశారు. ప్రస్తుతం ఓటర్ల వారీగా లెక్కలు తీశారు. ప్రతి 10 మందికి ఒక ఇన్‌ఛార్జిని నియమించారు. పది మంది ఇన్‌ఛార్జులపై పర్య వేక్షణకు మరొకరిని నియమించారు. ఇలా మండలాల వారీగా సాగుతోంది. కొంత మంది నాయకులు రంగంలోకి దిగారు. వీరి ద్వారా ఓటుకు కొంత లెక్క న డబ్బు, వస్తువులు ఇవ్వజూపుతున్నారు. ఇటీవలే ఓ పాఠశాలలో హెచ్‌ఎంకు ఆ పాఠశాలలో ఉన్న ఓట్లన్నీ వేయించాలని ఓటుకు రూ.5 వేలు లెక్కన ఇవ్వజూపారు. కాదనడంతో మరింత పెంచేందుకు సిద్ధమయ్యారు. హ్యాండ్‌ బ్యాగులు, సూట్‌ కేసులు పంపకాలు చేస్తున్నారు. కొందరికి విలువైన సెల్‌ఫోన్లు కూడా ఇవ్వ జూపుతున్నారు. పట్టభద్రులకు ఇదే విధంగా డబ్బు, ఫోన్లు ఇస్తా మని ఆశపెడుతున్నారు. వీరిపై ఎక్కువగా స్థానిక నాయకులే ఒత్తిడి తెస్తున్నారు. పంపకాల బాధ్యత వారే తీసుకుంటున్నారు. ఓటు మాత్రం ఖచ్చితంగా వేసేలా అన్నివిధాలా జాగ్రత్త పడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com