మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 03:24 PM
 

న్యూఢిల్లి : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఎనిమిది మంది జవాన్లు మృతి చెందిన సంఘటన పట్ల కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. సిఆర్‌పిఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌తో తాను మాట్లాడానని, సంఘటనా స్థలానికి వెళ్లి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించానని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు.