2017-18లో రైతులకు రూ.79,287 కోట్ల రుణాలిచ్చాం: మంత్రి సోమిరెడ్డి

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 01:34 PM
 

అమరావతి: 2017-18లో రైతులకు రూ.79,287 కోట్ల రుణాలిచ్చామని మంత్రి సోమిరెడ్డి అన్నారు. పంట రుణాలపై శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. కౌలు రైతులకు రూ.2,693 కోట్ల రుణాలిచ్చామని పేర్కొన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యంతో 91 శాతం సాధించామన్నారు. ఇప్పటి వరకు 2లక్షల క్వింటాళ్ల కందులు, 50వేల క్వింటాళ్ల మినుములు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. నాఫెడ్‌ ద్వారా 10 లక్షల క్వింటాళ్ల మినుములు, 3 లక్షల క్వింటాళ్ల పెసలు కొనుగోలుకు ప్రతిపాదన ఉందన్నారు.