పోలవరంపై ఎపి సర్కార్‌ శ్వేతపత్రం విడుదల చేయాలి : ఎంపి వరప్రసాద్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 01:33 PM
 

న్యూఢిల్లి : పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైకాపా ఎంపి వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి, రాజీనామాలకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.