బిగ్ బీ అమితాబ్‌కి అస్వ‌స్థ‌త

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 01:28 PM
 

ఏడు ప‌దుల వ‌య‌స్సులోను 20 ఏళ్ళ కుర్రాడిలా సినిమాలు చేస్తూ వెళుతున్న అమితాబ్ మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కి గుర‌వ్వ‌డం అభిమానుల‌ని ఆందోళ‌న‌కి గురి చేస్తుంది. అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్ర షూటింగ్ త‌ర్వాత బిగ్ బీ అస్వ‌స్థ‌తకి గురి కావ‌డంతో వెంట‌నే ఆయ‌న‌ని జోధ్‌పూర్‌లోని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బిగ్ బీకి చికిత్స అందించేందుకు ముంబై నుండి జోధ్‌పూర్‌కి ప్ర‌త్యేక వైద్య బృందం కూడా వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల మెడ నొప్పి, వెన్నునొప్పితో బాధ పడుతున్న అమితాబ్ లీలావతి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందిన సంగ‌తి తెలిసిందే. థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంతో పాటు బ్ర‌హ్మ‌స్త్రా, 102 అనే చిత్రాల‌లోను బిగ్‌బీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ రోజు ఉద‌యం కూడా ప‌లు ట్వీట్స్ చేసిన అమితాబ్ స‌డెన్‌గా అస్వ‌స్థ‌త‌కి గురి కావ‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ఆయ‌న అనారోగ్యం నుండి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు.