లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 11:42 AM
 

న్యూఢిల్లి : లోక్‌సభ సమావేశం మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే టిడిపి సభ్యులు ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీనితో సభా కార్యక్రమాలకు అంతరాయం వాటిల్లడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.