సీఎం కేజ్రీవాల్ సలహాదారు వీకే జైన్ రాజీనామా

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 11:37 AM
 

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సలహాదారు వీకే జైన్ రాజీనామా చేశారు. ఈ మేరకు వీకే జైన్ ఢిల్లీ సీఎంవో, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీసులకు తన రాజీనామా లేఖ కాపీలను పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు వీకే జైన్ తెలిపారు. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్‌పై దాడి కేసుకు సంబంధించి న ఆరోపణల్లో ఢిల్లీ పోలీసులు వీకే జైన్‌ను ప్రశ్నించిన నేపథ్యంలో..వీకే జైన్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీకే జైన్ గతేడాది సెప్టెంబర్‌లో సీఎం సలహాదారుగా నియమితులయ్యారు.