రైల్వే మంత్రితో ఉత్తరాంధ్ర టిడిపి ఎంపిల భేటీ

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 10:53 AM
 

న్యూఢిల్లి : రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తో ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం ఎంపిలు సమావేశం కానున్నారు. నేటి సాయంత్రం 4 గంటలకు పీయూష్‌ గోయల్‌తో వారు సమావేశమవుతారు. విశాఖ రైల్వే జోన్‌ అంశంపై వారు గోయల్‌తో చర్చించనున్నారు. రైల్వే జోన్‌ సాధ్యపడదంటూ రాష్ట్ర అధికారులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి చెప్పిన విషయాన్ని ఉత్తరాంధ్ర టిడిపి ఎంపిలు రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు.