విభజన హామీలపై నేడు అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 10:18 AM
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, విభజన హామీలపై అసెంబ్లీలో నేడు ప్రత్యేక తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన కేంద్రం వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. పార్లమెంటులో చేసిన పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని, విభజన హామీలను అమలు చేయమనడం అహేతుకమా అని ప్రశ్నించారు. పార్లమెంటులో ఎంపీల ఆందోళనను అభినందించిన ఆయన ఇతర పార్టీల ఎంపీలను కూడా సమన్వయం చేసుకుని ఆందోళనను ఉదృతం చేయాలన్నారు.