ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 10:06 AM
 

అమరావతి :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుుడు తెలుగుదేశం ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు పార్లమెంటులో కొనసాగిస్తున్న ఆందోళనను అభినందించారు. ఆందోళన కొనసాగించాలని ఆదేశించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆందోళణ కొనసాగించాలన్నారు. నిర్మాణాత్మకంగా ఆందోళణ కొనసాగించాలని సూచించారు. ఎంపీల ఆందోళణకు మద్దతుగా రాష్ట్రంలో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగించాలన్నారు. రాష్ట్రప్రజల మనోభావాల విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.