రాష్ట్ర విభజనకు అందరూ బాధ్యులే : రఘువీరారెడ్డి

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 04:16 PM
 

రాష్ట్ర విభజనకు అందరూ బాధ్యులేనని, కేవలం, కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ విమర్శలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది .. బీజేపీ మోసం చేసింది’ అని బాధ్యత కలిగిన వ్యక్తులు వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాల విధానాలు, నిర్ణయాలతో భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందని, ఇలా జరగకుండా ఉండాలంటే, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలయ్యేలా పోరాడదామని ప్రజలకు పిలుపు నిచ్చారు.