న్యూఢిల్లీ : లవ్ జిహాద్ కేసులో సుప్రీం తీర్పును హాదియా స్వాగతించింది. ఒక వార్తా సంస్థతో మాట్లాడిన ఆమె ఇప్పుడు తనకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తనకు ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. రెండు విషయాలతో సుప్రీం కోర్టును ఆశ్రయించానని హాదియా అన్నారు. ఒకటి తాను ముస్లింగా జీవించాలని, రెండోది తన భాగస్వామితో కలిసి బతకాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించాననీ ఆ రెంటినీ సుప్రీం అంగీకరించిందని హాదియా పేర్కొన్నారు.