కార్తికి 12 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 03:36 PM
 

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తి చిదంబరంను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిలు కోసం కార్తి దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు బెయిలు నిరాకరించి ఆయనను 12 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.