ఫడ్నవీస్ సర్కార్ కు చెమటలు పట్టించిన అన్నదాత

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 02:37 PM
 

ధర్నాలు, రాస్తారోకోలు, హింసాకాండ లేకుండానే మహా రైతులు సర్కార్ కు చెమటలు పట్టించారు. దాదాపు 180 కిలోమీటర్లు పాదయాత్రగా కదలి వచ్చి ముంబై మహానగరంలో మహాధర్నా నిర్వహించారు. కనీవినీ ఎరుగని రీతిలో రైతులు చేపట్టిన ఈ ఆందోళన ఫడ్నవీస్ సర్కార్ కు చెమటలు పట్టించింది. దీంతో రైతులను బుజ్జగించి వారి సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చింది. డిమాండ్ల పరిష్కారానికి తమ సర్కార్ సిద్ధంగా ఉందంటూ ఫడ్నవీస్ ప్రకటించారు.