గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చంద్రబాబు సమాధానం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 02:14 PM
 

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ శాసన మండలిలో మాట్లాడుతున్నారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చంద్రబాబు సమాధానం ఇస్తున్నారు. పార్టీకి కనకమేడల రవీంద్రకుమార్‌ ఎంతో కాలం నుంచి సేవ చేస్తున్నారని అన్నారు. అసెంబ్లి లాబీలో మీడియాతో కాసేపు సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. పార్టీపరంగా ఏ న్యాయ సమస్య వచ్చినా ముందుండేవారని గుర్తు చేశారు. పార్టీ పట్ల విధేయతే ఆయనకు ఉన్నత స్థానం కల్పించిందన్నారు. హేతుబద్ధత లేని విభజన వల్ల తీవ్రంగా నష్టపోయామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన జరిగిన తీరును నెమరువేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటు తలుపులు మూసేసి విభజన బిల్లును ఆమోదించారని పేర్కొన్నారు. విభజన తర్వాత 8 శ్వేతపత్రాలు విడుదల చేశానని, రాష్ట్రానికి అన్యాయం చేయొద్దని జాతీయ పార్టీలను కోరానన్నారు. రాజ్యసభలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అడుగుతున్నామని అన్నారు. ఆనాటి ప్రధాని చేసిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. విశాఖలో హుద్‌హుద్‌ వచ్చినప్పుడు ఉక్కు సంకల్పంతో పని చేశామని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకు చేయూత అందించాలని అడిగామన్నారు. అవసరమైతే రాత్రింబవళ్లు కష్టపడతామని,  హక్కుల విషయంలో రాజీలేదన్నారు. రాష్ట్ర సమస్యలపై 29 సార్లు ఢిల్లికి వెళ్లి అడిగామన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. విజయసాయిరెడ్డి ప్రధాని మోడీపై వివ్వాసం ఉందంటూనే అవిశ్వాసం పెడతామంటున్నారని పేర్కొన్నారు. వైసీపీ ద్వంద్వ వైఖరి చంద్రబాబు మండిపడ్డారు.