త్రిపురలో నూతన ప్రభుత్వానికి సీతారాం ఏచూరి వినతి

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 11:35 AM
 

ప్రతిపక్షాలపై దాడులను తక్షణమే ఆపేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి త్రిపురలో నూతనంగా ఏర్పడిన బిజెపి-ఐపిఎఫ్‌టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు కృషి చేయాలని, దాడులలో గాయపడిన వారికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. హింసకు పాల్పడటం వారి (ఆరెస్సెస్‌) భావజాలంలో భాగమని ఏచూరి అన్నారు. గతంలో దీనిని తాము నిలువరించామని, ఇప్పుడు మళ్లి నిలువరించడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఇటువంటి రాజకీయాలు విజయం సాధించలేవని ఆయన చెప్పారు.