సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం: సీఎం చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 11:32 AM
 

అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పింఛన్ల పంపిణీలో ఎక్కడా అవినీతి లేకుండా చూశామన్నారు. స్కాలర్‌షిప్స్‌లో అవకతవకలు నివారించేందుకు ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టామన్నారు.