మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్ గా పని చేశారు : పవన్ కల్యాణ్

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 11:04 AM
 

విజయవాడ :తన తండ్రి మంగళగిరిలో కానిస్టేబుల్ గా పని చేశారని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. కాజలో తన నివాసానికి భూమి పూజ అనంతరం విలేకరులతో మాట్లాడారు. జనసేన పార్టీకీ, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరి సహకారం కావాలని ఆయన అన్నారు. పార్టీకి యువత ఉడుకు నెత్తురూ, పెద్దల అనుభవమూ కావాలని ఆయన అన్నారు. జనసేనపై ప్రజలకు విశ్వాసం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. దానిని నిలబెట్టుకోవాలని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని  పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. సమయం వచ్చినప్పుడు తన ఆస్తులను ప్రకటిస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ఇక్కడకు మకాం మారుద్దామని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం, పార్టీ విషయంలో అందరి సహకారం కావాలన్నారు.