గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 12, 2018, 10:28 AM
 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. ప్రజాసంకల్ప యాత్ర 110వ రోజుకు చేరుకుంది. జగన్‌ ఈ రోజు తన 110వ రోజు పాదయాత్రను ప్రకాశం జిల్లా ఈపురుపాలెం శివారు నుంచి ప్రారంభించారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్టుపురంలోకి ప్రవేశించింది. పాదయాత్రలో జగన్‌కు ఎమ్మెల్యే కోన రఘుపతి, వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. పాదయాత్ర బేతపూడి, వెదుళ్లపల్లి, వడ్డేపాలెం, మహాత్మాజీపురం మీదుగా బాపట్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది. మహాత్మాజీపురంలో జనంతో జగన్‌ మమేకం కానున్నారు. సాయంత్రం బాపట్లలో జరిగే బహిరంగ సభలో జగన్‌ పాల్గొని ప్రసంగించనున్నారు.