రిక్షా తొక్కుతున్నాడు కదా అని ఈ వ్యక్తిని చిన్నచూపు చూడకండి! ఎందుకంటారా?? అవును మరి.. అతడేమీ సాదాసీదా వ్యక్తి కాదు... మహా‘ఘను’డు.. పేరు గాలి జనార్ధన్‌రెడ్డి.. ఆ.. ఇక చాలు.. అర్థమయ్యిదంటారా!.. విషయానికి వస్తే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాలి జనార్ధన్‌రెడ్డి తన భార్యను ఆశ్చర్యంలో ముంచెత్తారు. గురువారం సాయంత్రం బెంగళూరులోని తన నివాసం పారిజాత అపార్ట్మెంట్ వద్ద గాలి జనార్ధన్‌రెడ్డి దంపతులు సందడి చేశారు. పూలతో అలంకరించిన సైకిల్ రిక్షాపై తన సతీమణి అరుణను కూర్చోబెట్టుకొని కాసేపు అటూ ఇటూ తిప్పుతూ సతీ సేవ చేశారు జనార్ధన్‌రెడ్డి.
ఈ సందర్భంగ సోషల్ మీడియాలో ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘భూమి మీద అత్యంత్య అందమైన సృష్టి స్త్రీ. మనకు జీవం పోయడంతో పాటు మన జీవనంలో తోడుండి సపర్యలు చేస్తూ ఆమె ఎన్నో త్యాగాలు చేస్తుంది. ఒక తల్లిగా, భార్యగా, సోదరిగా, కుమార్తెగా ఎన్నో రూపాల్లో మనకు సేవలు చేస్తుంది. ఆమె ప్రేమ ఎనలేనిది. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని అంటారు. స్త్రీల పట్ల మనం గౌరవంగా నడుచుకోవడమే వాళ్లకు మనం ఇచ్చే నిజమైన గౌరవం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’’ అంటూ కన్నడలో రాసుకొచ్చారు.