తారాపూర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Fri, Mar 09, 2018, 09:46 AM
 

మహారాష్ట్ర: ముంబయికి 150 కిలోమీటర్ల దూరంలోని పాల్‌గర్‌లోని తారాపూర్ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రైవేటు కెమికల్ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని 13 మంది వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు గల కారణం ఇంకా తెలియరాలేదు. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు మృతిచెందారు.