21న లోక్‌సభలో అవిశ్వాసానికి టీడీపీ కలిసి రావాలి: జగన్‌

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 08, 2018, 01:58 PM
 

మార్చి 21న లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా సంతరావురులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 21న లోక్‌సభలో అవిశ్వాసానికి టీడీపీ కలిసి రావాలన్నారు. అవిశ్వాసం తామే పెడతామని, చంద్రబాబు మద్దతు ఇవ్వాలని కోరుతున్నానని జగన్‌ అన్నారు. ఒకవేళ అవిశ్వాసం చంద్రబాబు పెడితే తాము మద్దతిస్తామని జగన్‌ పేర్కొన్నారు. మార్చి 21 వరకు చంద్రబాబు కోసమే మేం సమయం ఇచ్చామన్నారు. బాబు కలిసొస్తానంటే అవిశ్వాసం రేపే పెడదామన్నారు. ఎంపీలంతా రాజీనామా చేస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుందన్నారు. 25 మంది ఎంపీలు ఒక్కతాటిపై నిలబడదామన్నారు.