నాగాలాండ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 08, 2018, 01:54 PM
 

కోహిమ: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ నాయకుడు నెయిఫియి రియో ఆ రాష్ట్రముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ పద్మనాభ ఆచార్య నెయిఫియి రియోతో ప్రమాణస్వీకారం చేయించారు. రియో ఈ నెల 16వ తేదీలోగా సభలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూ, అసోం సీఎం సర్బానంద సోనోవాల్, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, కిరణ్ రిజిజు హాజరయ్యారు.