బాలీవుడ్ నటి రవీనా టాండన్‌పై కేసు

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 07, 2018, 12:40 PM
 

బాలీవుడ్ నటి రవీనా టాండన్‌పై కేసు నమోదైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న లింగరాజ ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా అడ్వర్‌టైజ్‌మెంట్ కోసం షూటింగ్ జరిపారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. నిజానికి ఆ ఆలయంలో కెమెరాలను అనుమతించరు. అలాంటి చోట యాడ్ షూటింగ్ చేయడంతో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రవీనా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. అసలు అక్కడ యాడ్ ఏజెన్సీ లేదు. యాడ్ షూటింగే జరగలేదు. అక్కడి మీడియా, అభిమానులు మాత్రం తమ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటున్నారు అని ఆమె చెప్పింది. అయినా అక్కడ మొబైల్ ఫోన్లను అనుమతించరన్న విషయం తనకు తెలియదని, అక్కడి అధికారులు కూడా ఫొటోలు తీస్తుంటే వద్దని చెప్పలేదని రవీనా అంటున్నది.