హైదరాబాద్: జగన్ సవాల్‌ను స్వీకరిస్తున్నామని పవన్ కల్యాణ్ చెప్పడం సరికాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ఎక్కడా సవాల్ చేయలేదని చెప్పిన అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో పవన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మేం మద్దతు కూడగట్టి అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నామని చెప్పారు. పవన్ మమ్మల్ని నమ్మారా? చందరబాబునే నమ్ముతారా? అని అంబటి ప్రశ్నించారు.