ఫ్లోరిడ్ : అమెరికాలోని ఫ్లోరిడా పాఠశాల కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరామర్శించారు. తన భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి ఆసుపత్రికి వచ్చారు. గాయపడ్డ వారికి సరైన వైద్యాన్ని అందిస్తున్నందుకు వైద్యులను, నర్సులను కృతజ్ఞత తెలిపారు. కాల్పుల ఘటనలో ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. ఇది చాలా బాధాకరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను ట్రంప్ రావాలని కోరుకోలేదని, కానీ తుపాకీ నుండి ఎక్కువ భద్రతను కోరుకుంటున్నానని కెవిన్ అనే విద్యార్థి పేర్కొన్నారు.