రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు: అచ్చెన్నాయుడు

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 03:20 PM
 

అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబుతో ముఖ్యనేతల భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరనందుకే ఇప్పుడు ఆందోళణ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో తమ పార్టీ  ఎంపీలు చేసిన ఆందోళనతో ఏపీ సమస్యలపై జాతీయ స్థాయిలో కదలిక వచ్చిందన్నారు. ఎన్డీయే మిత్ర పక్షాలన్నీ తెలుగుదేశం ఎంపీల ఆందోళనకు మద్దతుగా నిలిచాయని చెప్పారు. ఇప్పుడు కూడా మార్చి 5 వరకూ వేచి చూస్తామనీ, అప్పటికీ కేంద్రం రాష్ట్రానికి కేటాయింపులు, నిధుల పట్ల సంతృప్తికరమైన చర్యలు తీసుకోకుండా తమ ఆందోళనను ఉదృతం చేస్తామని చెప్పారు.