ఈ నెలలోనే పార్టీ పేరు ప్రకటిస్తా: కమల్‌హాసన్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 03:11 PM
 

చెన్నై: ఈ నెలలోనే పార్టీ ప్రకటిస్తానని సినీనటుడు కమల్‌హాసన్‌ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ పేరు ప్రకటించి విధివిధానాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. తాను నటుడిగా చనిపోవడానికి ఇష్టపడడం లేదని సినీనటుడు అన్నారు. అందుకే పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్నానన్నారు. రాబోతున్న 2 సినిమాల తర్వాత ఇక సినిమాలు చేయనని వెల్లడించారు. బ్యాంకులో డబ్బులు దాచేందుకు రాజకీయాల్లోకి రావడం లేదని, రాజకీయాల్లోకి రావాలని పదేళ్ల క్రితమే నిర్ణయించుకున్నానన్నారు.