అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 12:00 PM
 

అమరావతి : టీడీపీ ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.  ఈ భేటీలో కేంద్రంతో సంబంధాలు, విభజన హామీల సాధన, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై  ప్రధానంగా చర్చిస్తారు.రెవెన్యూ లోటు విషయంలో న్యాయపోరాటం, వైకాపా ఎంపీల రాజీనామా నిర్ణయం, జనసేనాని పవన్ కల్యాణ్ దూకుడు పెంచడం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. అలాగే విభజన చట్టంలోని అంశాలు, విభజన హామీల అమలు విషయంలో కేంద్రం వైఖరి తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ భేటీలో ఆర్థిక మంత్రి యనమల  రామకృష్ణుడు, మంత్రి, పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.