4 డివిజన్లు కలుపుతూ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలి : ఎంపి రామ్మోహన్‌ నాయుడు

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 11:34 AM
 

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌లోని 4 రైల్వే డివిజన్లను కలుపుతూ కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని ఎంపి రామ్మోహన్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్రలో రైల్వేపరంగా అనేక సమస్యలు ఉన్నాయని, రైల్వే సమస్యలపై భాష తెలియని ప్రాంతాలకు వెళ్లవలసి వస్తున్నదని ఆయన అన్నారు. రైల్వే జోన్‌ విషయమై ప్రధానికి, రైల్వే మంత్రికి లేఖలు రాసినట్లు ఆయన చెప్పారు. కుర్దా డివిజన్‌లోని ఎపికి చెందిన 7 స్టేషన్లను ఈ జోన్‌లోకి తీసుకు రావాలని ఆయన అన్నారు.