కాన్పూర్‌లో సైనికుడి మృతి

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 10:35 AM
 

కాన్పూర్ : ఓ సైనికుడిని మృతి చెందిన ఘటన కాన్పూర్‌లోని చకేరి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సైనికుడి సోదరి కథనం ప్రకారం.. తన సోదరుడు అతని స్నేహితుడి రిసెప్షన్‌కు మంగళవారం వెళ్లాడు. అయితే తన బ్రదర్.. రైఫిల్‌తో కాల్చుకున్నాడని మొదట ఫోన్ చేసి చెప్పారు. కాసేపటికే మళ్లీ ఫోన్ చేసి మీ సోదరుడు చనిపోయాడని చెప్పారని ఆమె తెలిపింది. తన సోదరుని మృతిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఓ వ్యక్తి రైఫిల్‌ను కాళ్లతో తన్నడం వల్లే ప్రమాదవశాత్తు బుల్లెట్ పేలి సోల్జర్ మృతి చెందాడని చెప్పారు. మరీ ఛాతీ భాగంలో బుల్లెట్ గాయం ఎలా అవుతుందని మృతుడి సోదరి ప్రశ్నించింది. సైనికుడి మృతిపై పోలీసులు విచారణ చేయగా.. ఓ వ్యక్తి జవాన్‌పై కాల్పులు జరిపినట్లు తేలింది. ఈ క్రమంలో సైనికుడు మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు.