కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మృతి!

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 10:02 AM
 

కేంద్ర మాజీ మంత్రి, ఆంధ్రా షుగర్స్ ఎండీ, టీడీపీ నేత బోళ్ల బుల్లిరామయ్య మృతి చెందారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో ఆయన జన్మించారు. 1984, 1991, 1996, 1999 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. 1996-98 మధ్య కాలంలో ఆయన కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రిగా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.