కాసేపట్లో కలిగిరి శివారు నుంచి ప్రారంభం కానున్న జగన్‌ పాదయాత్ర

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 08:54 AM
 

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ 87వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించనున్నారు. జగన్‌ తన 87వ రోజు పాదయాత్రను మరికాసేపట్లో ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి శివారు నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర కృష్ణారెడ్డిపాలెం, కుడుములదిన్నె పాడు, తెల్లపాడు క్రాస్‌, చిన్న అన్నలూరు, మావిడాళ్లపాలెం మీదుగా జంగాలపల్లి వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా జంగాలపల్లిలో జగన్‌ ప్రజలతో మమేకం కానున్నారు.