యువతీ యువకులకు ప్రేమించుకునే హక్కు ఉంది : ప్రవీణ్‌ తొగాడియా

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 03:52 PM
 

న్యూఢిల్లి : వాలెంటైన్‌ డే సందర్భంగా యువతీ యువకులు పార్కుల్లోనూ, ఇతర ప్రదేశాల్లోనూ కనిపించకూడదంటూ బజరంగ్‌దళ్‌, విహెచ్‌పి తదితర సంస్థల సభ్యులు బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా యువతీ యువకులకు ప్రేమించుకునే హక్కు ఉందని చెప్పారు. చండీగఢ్‌లో జరిగిన విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌ కార్యకర్తల సమావేశంలో తొగాడియా మాట్లాడుతూ ప్రేమించుకునే యువతీ యువకులకు అడ్డుపడవద్దనారు. ”ప్రేమ్‌ నహి కరేందే తో వివాహ్‌ నహీ హోగా, వివాహ్‌ నహీ హోగా తో సృష్టి కైసే చలేగీ? యువ అవుర్‌ యువతీయోంకో ప్రేమ్‌ కర్నేకా పూరా అధికార్‌ హై. వో అధికార్‌ ఉన్హే మిల్‌నా చాహియే” (ప్రేమించుకోనివ్వకపోతే వివాహాలు జరుగవు, వివాహాలు జరగపోతే సృష్టి ఎలా సాగుతుంది? యువకులు, యువతులకు ప్రేమించుకునేందుకు పూర్తి అధికారం ఉంది. ఆ అధికారం వారికి అందాల్సిందే) అని తొగాడియా అన్నారు. ప్రేమించుకునే వారి విషయంలో నిరసన ప్రదర్శనలు, బెదిరింపులకు దిగవద్దని తొగాడియా అన్నారు. ” మన కుమార్తెలు, సోదరీమణులకు ప్రేమించుకునే హక్కు ఉంది” అని ఆయన అన్నారు.