రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తాం: సీపీఎం మధు

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 02:24 PM
 

విజయవాడ: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తామని ఏపీ సీపీఎం కార్యదర్శి మధు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రైల్వే జోన్‌పై కేంద్రం నాలుగేళ్లుగా నాన్చుతోందని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం కలిసొచ్చే పార్టీలను కలుపుకుపోతామన్నారు. ప్రభుత్వం చేస్తున్న హడావుడిని స్వాతంత్య్ర పోరాటంతో పోల్చి ప్రజలను మోసగిస్తున్నారన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలు వెల్లడించాలని అన్నారు. టీడీపీ నేతల ఆస్తులను చంద్రబాబు అధ్యయనం చేయాలన్నారు. రేపు వామపక్ష పార్టీలతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పవన్‌ కల్యాణ్‌ కమిటీ అధ్యయనం చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. తామూ అధ్యయనం చేస్తున్నామని, సలహాలుంటే స్వీకరిస్తామన్నారు.