కొచ్చిన్ షిప్‌యార్డు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన గడ్కరీ
Written by : Suryaa Desk
![]() |
![]() |

న్యూఢిల్లి : కొచ్చిన షిప్‌యార్డులో సాగర్ భూషణ్ నౌకకు మరమ్మతులు చేస్తుండగా పేలుడు సంభవించి నలుగురు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మృతుల కుటుంబాలకు గడ్కరీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొచ్చిన్ షిప్‌యార్డు ఎండితో తాను మాట్లాడానని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు.