మార్చి తర్వాత యుగాంతం

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 12:34 PM
 

యుగాంతం 2017లోనే అంటూ గతంలో ఊదరగొట్టిన క్రైస్తవ సంఖ్యా శాస్త్రవేత్త డేవిడ్ మేడే మరోసారి యుగాంతం 2018లోనే అంటూ ప్రకటించారు. యుగాంతం 2017 అంటూ ఆయన చెప్పిన అంచనాలు తప్పాయి. వీటిని సవరిస్తూ 2018 మార్చి తర్వాత ఎప్పుడైనా కొన్ని ఘటనలు జరుగుతాయని, అవి కల్లోలానికి దారితీసి ప్రపంచం అంతానికి దారితీస్తుందన్నారు. ‘‘నేను ప్రతీ నెలా మరింతగా అధ్యయనం చేస్తున్నాను. 2018 వేసవిలో భయంకర ఘటన జరగనుంది. మార్చిలో ఉత్తరకొరియా ప్రపంచ సూపర్ పవర్ గా అవతరించనుంది’’ అని మేడే పేర్కొన్నారు. ప్లానెట్ ఎక్స్ (నిబిరు) ప్రపంచం అంతానికి దారితీస్తుందన్నారు. అయితే, ఆయన అంచనాలకు ఎక్కడా తార్కికత, పొంతన లేకపోవడం గమనార్హం.