ఢిల్లి పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరెస్టు

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 11:57 AM
 

ఢిల్లి పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లి పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ నిబంధనలకు పాతర వేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కారణంగానే ఆ స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురై నలుగురు విద్యార్థుల మృతికి కారణమైందని పోలీసులు ఆరోపించారు. స్కూల్‌ బస్సుల నిర్వహణ, రవాణా శాఖ నియమ నిబంధనలను స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సుదర్శన్‌ సోనార్‌ ఉల్లంఘించారని డిఐజి హరినారాయణాచారి మిశ్రా చెప్పారు. సుదర్శన్‌ సోనార్‌ను కోర్టులో హాజరుపరచగా ఆయనను ఈ నెల 22వ తేదీ వరకూ జ్యుడిషియల్‌ కస్టడీకి పంపించారు.