కేంద్రం ఇప్పటికే ఏపీకి ఎక్కువ నిధులిచ్చింది: సోమువీర్రాజు

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 11:32 AM
 

విజయవాడ: కేంద్రం ఇప్పటికే ఏపీకి ఎక్కువ నిధులిచ్చిందని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. విభజన హామీలు నెరవేర్చడానికి 2022 వరకు సమయం ఉందన్నారు. ఐదేళ్లలోనే అన్ని చేయాలని కాంగ్రెస్‌ బిల్లులో ఎందుకు పెట్టలేదన్నారు. చట్టంలో ఉన్న ఎనిమిది సంస్థలను కూడా నెలకొల్పారని పేర్కొన్నారు. సంతృప్తిగా ఉన్నాం, కేంద్రం అన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రితో పాటు సుజనా చౌదరి అనేకసార్లు చెప్పారని గుర్తు చేశారు. అప్పుడు బాగుందన్నవాళ్లు, ఇప్పుడు బాగోలేదని ఎందుకుకంటున్నారో చర్చించాలన్నారు.