సిఎం చంద్రబాబుతో భేటీ కానున్న ముకేష్‌ అంబానీ

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 11:11 AM
 

అమరావతి : రిలయెన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ నేడు అమరావతికి రానున్నారు. నేటి సాయంత్రం 4 గంటలకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ముఖేష్‌ సమావేశమవుతారు. అమరావతిలో పెట్టుబడుల విషయమై చంద్రబాబుతో ముఖేష్‌ చర్చిస్తారు. సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని ముఖేష్‌ పరిశీలిస్తారు.